Tuesday, 3 November 2026

అసెంబ్లీపై తెలంగాణ జెండా ఎగిరింది: కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ విజయవంతమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఛలో అసెంబ్లీ ఆందోళన అనంతరం ఆయన ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి ఛలో అసెంబ్లీ ఆందోళనతో అసెంబ్లీపై తెలంగాణ జెండా ఎగిరిందని అభివర్ణించారు. రాష్ట్ర శాసన సభ చరిత్రలో తొలిసారిగా చావు డప్పు మోగిందని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి ప్రజాస్వామ్యంపై విశ్వాసంలేదని , ఆయన ప్రజామోదంలేని నాయకుడని విమర్శించారు. ఆయనపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పోలీసులనే సీఎం నమ్ముకుంటున్నారని, ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *