Tuesday, 3 November 2026

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగింది. అంతకు ముందు ఎమ్మెల్యేల బృందం టీడీఎల్పీ కార్యాలయంలో సమావేశమై విద్యుత్‌ సమస్యలపై చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై చర్చించింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసేందుకు నేతలు బయలు దేరగా వారితో ఉన్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేల  బృందం అసెంబ్లీ ఆవరణలో భైఠాయించి ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *