Monday, 2 November 2026

అసెంబ్లీ ఎదుట రోడ్లు ఊడ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్,  : జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు. జీతాలు పెంచాలని అడిగిన కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేయడం ఎంత వరకు న్యాయమని బీజేపీ నేతలు ప్రశ్నించారు. తొలగించిన జీహెచ్ఎంసీ కార్మికులను వెంటనే ఉద్యోగాలకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *