Thursday, 5 November 2026

అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు: అరుణ

హైదరాబాద్‌: అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. విపక్ష సభ్యులను మార్షల్స్‌తో అడ్డుకున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరితే మార్షల్స్‌తో కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియంలోకి చొచ్చుకొచ్చి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. గవర్నర్‌ సమక్షంలో విపక్ష నేతలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు పిడిగుద్దులు కురిపించారని పేర్కొన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. అధికార మదంతో ప్రతిపక్షాలను బుల్‌డోజ్‌ చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి పాడె కట్టే సమయం దగ్గర పడిందని అరుణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *