– నూతన ఒరవడితో ముందుకెళ్తున్న రాష్ట్రం– అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
– ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినా నూతన ఒరవడితో పయనిస్తోందని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో మంచి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గవర్నర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఫించన్ల పథకం దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలౌతోందని నరసింహన్ అన్నారు. ఇరిగేషన్ రంగానికి ప్రభుత్వం ప్రథమ పాధాన్యమిచ్చిందని, చెరువుల పునరుద్దరణకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ, మంచినీటికోసం వాటర్‌గ్రిడ్ పథకాలు హర్షనీయమన్నారు.
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ వంటి పథకాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచాయని గవర్నర్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో పారిశ్రామిక విధానం రాష్ట్ర సత్వర అభివృద్ధి పొందేందుకు దోహద పడతాయని చెప్పారు.
సర్వతోముఖాభివృద్ధి దిశగా తెలంగాణ
– అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
* ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది.
* పేద, బడుగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాం.
* ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం
* దళితవాడల్లో దారిద్రాన్ని పోగోట్టడానికి 3 ఎకరాల భూపంపిణీ పథకం
* ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మీ, మైనార్టీలకు షాదీముబారక్ పథకాలు.
* దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ
* సేవారంగంలో 9.7 శాతం వృద్ధిని సాధించాం.
* ఈ ఏడాది వృద్ధి రేటు 5.3శాతంగా అంచనా
* కేజీ టు పీజీ ఉచిత విద్యకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
* ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్
* మహిళల భధ్రత కోసం షి టీమ్స్
* వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాం.
* గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు
* ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధిన్యం
* ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీటిని అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నం
* చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ
* ఇంటింటికీ మంచి నీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం
* ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సింగిల్ విండో పారిశ్రామిక విధానం
* ఐటీఐఆర్ ద్వారా 50 లక్షల ఉద్యోగాల కల్పన
* ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
* ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారం
* బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండగలుగా గుర్తించాం.
* సీఐడీ విచారణ తరువాత గృహనిర్మాణ పథకం.
* జర్నలిస్టులు, లాయర్ల సంక్షేమం కోసం రూ.100 కోట్ల ఫండ్
* ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు పెడతాం
* ఎమ్మెల్యేల నిధులు రూ.1.౫ కోట్లకు పెంపు
* హైదరాబాద్ లో వైఫై సేవలు
* త్వరలోనే విద్యుత్ సమస్యను అధిగమిస్తాం