Wednesday, 4 November 2026

అసెంబ్లీ, మండలి సమావేశాలకు భారీ బందోబస్తు

ఈ నెల 23 (బుధవారం) నుంచి జరగనున్న రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని చెప్పారు. డాగ్ స్క్వాడ్స్ తో పాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *