అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ.
ఫొటో : తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఉప సర్పంచ్.
నెన్నెల, డిసెంబర్ 31, (జనంసాక్షి )
మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని గొల్లపల్లి ఉప సర్పంచ్ జాడి నారాయణ ఆరోపించారు. డిసెంబర్ నెల కోటా బియ్యం పంపిణీ గడువు ముగిసిన తర్వాత పంపించడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు బియ్యం పంపిణీ చేసే పరిస్థితులు లేవు, పోనీ వచ్చే నెల పంపిణీ చేయలేము ఎలా అని అధికారులను ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పడు వచ్చిన బియ్యం కోటా గడువు పెంపుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని తహసీల్దార్ భూమేశ్వర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ.




