Monday, 2 November 2026

చీత్రియాల పిఎసిఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చందంపేట ఎంపీపీ పార్వతి చందు నాయక్

చీత్రియాల పిఎసిఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చందంపేట ఎంపీపీ పార్వతి చందు నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 31 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు పిసిసి నాయకులు, చీత్రియాల పిఎసిఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి కు చందంపేట ఎంపీపీ పార్వతి చందు నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాలె నరసింహారెడ్డి ఉమ్మడి చందంపేట మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చాలా మంది పేద రైతులను, పేద ప్రజలను ఆదుకున్నారని గ్రామాలలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించారని, పేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక సాయం అందించారని గ్రామాలలో దేవాలయాల నిర్మాణానికి, గ్రామాలలో తమ సొంత నిధులతో బోర్లు వేయించారని, పాఠశాలలో ప్రహరి గోడల నిర్మాణానికి, మరుగుదొడ్ల నిర్మాణానికి, పేద మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకుఆర్థికంగా సహకరించారని, కరోనా మహమ్మారి విస్తృతంగా ప్రభలుతున్న రోజులలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా సోకిన బాధితులకు అండగా ఉంటూ ఎంతో భరోసా ఇచ్చారని ఇలాంటి విలువైన ప్రజా సేవ చేసే నాయకులు ఉండడం చాలా మంచి విషయమని వారు మండల ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు అనంతరం శాలువా గిరిజన సాంప్రదాయమైన తలపాగా, పూల దండలతో సత్కరించి కేక్ కట్ చేసి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, ప్రజలకు వారి విలువైన మరెన్నో సేవలు అందించాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు