
-; అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం
-; సర్పంచుల ఫోరం అధ్యక్షులు కార్యదర్శి కాగిత రాములు
సైదాపూర్ /జనం సాక్షీఅన్ని రంగాల్లో అమలైన వివక్షకు వ్యతిరేకంగా తెలంగాఅస్తిత్వం, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగిందని సర్పంచుల ఫోరం అధ్యక్ష ,కార్యదర్శి చందా శ్రీనివాస్, కాయిత రాములు అన్నారు. గురువారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని సైదాపూర్, లస్మ న్నపల్లి గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులు మాట్లాడుతూ …ఆరు దశాబ్దాల పాటు తొలి, మలిదశ ఉద్యమం త్యాగపూరితమైందని అన్నారు.తెలంగాణ ఉద్యమం అణచివేతను ,హింసను లెక్కచేయకుండా ప్రజలు కొనసాగించారని పేర్కొన్నారు. 1969 తొలి దశ ఉద్యమంలో వందల మంది వీరులు పోలీస్ కాల్పుల్లో అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అహింసాయుతంగా ,శాంతియుత పంతాలో జరిగిన మలిదశ ఉద్యమంలో ఎంతోమంది యువతి, యువకులు, విద్యార్థులు ,పౌరులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని వారి అమరత్వం వెలకట్టలేనిదని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం విలువైన ప్రాణాలను అర్పించిన అమరులందరూ చిరస్మరణీయులని కొనియాడారు .నేడు రాష్ట్రం సాధిస్తున్న ఉజ్వల ప్రగతిలో వారి త్యాగం దేదిప్యమానమై ప్రతిపలిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీలక్ష్మి, శ్రీనివాస్ ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




