జనంసాక్షి , మంథని : ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన విజయవంతగా 9 సంవత్సరలు పూర్తి చేసుకున్న సందర్బంగా మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మ వాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ, బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్,బోగోజు శ్రీనివాస్, ఎడ్ల సదశివ్, పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్, ఎస్ స్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కాసర్ల సూర్య,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు, పట్టణ కార్యదర్శి ఆకుల అరుణ్, సోషల్ మీడియా కో కన్వినర్ తడూరి రవి, యువ నాయకులు ఎడ్ల సాగర్, విరుగుర్రాల శేఖర్, లక్ష్మణ్, శివ, వేణు, రాజకుమార్, ప్రశాంత్, శేఖర్, నరేష్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిపాలనను ప్రతి ఇంటికి తెలియజేస్తాం




