గుజారాత్ లోని అహ్మదాబాద్ లో వల్డ్ ఫస్ట్ సోలార్ ప్లేన్ ఇంపల్స్ సందడి చేస్తోంది. వల్డ్ టూర్ లో భాగంగా అబుదాబి నుంచి ఈ సాహాస యాత్ర ప్రారంభమైంది. ఇందనం లేకుండా పూర్తిగా సోలార్ రిచార్జబుల్ బ్యాటరీలతో ఈ విమానాం ప్రయాణిస్తుంది. ఐదు నెలల ప్రపంచ పర్యటన తరువాత ఈ విమానం తిరిగి అబుదాబి చేరుకోనుంది.
గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఈ విమానం మద్దతుగా.. గంగానది మీదుగా ప్రయాణించనుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆగి మయన్మార్ లోని మాండలేకు బయలుదేరనుంది. చైనాలోని చాంగ్ కిన్, నాన్ జింగ్ లో ఇంపల్స్ హాల్ట్ చేయనుంది. ఆ తరువాత పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి, న్యూయార్క్ ను సందర్శించనుంది.
స్విట్జర్లాండ్ లో తయారైన ఈ విమానంలో ఒక చుక్క ఇంధనం లేకుండా కంప్లీట్ గా… సౌరశక్తితో పగలు, రాత్రి అని తేడా లేకుండా ప్రయాణం చేయగలదు. సింగిల్ సీట్ ఉన్న ఇంపల్స్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో తయారు చేసారు. దీని రెక్కలు 72 మీటర్ల పొడవుగా ఉన్నాయి. బోయింగ్ 747 విమానం కంటే ఇంపల్స్ వింగ్ స్పాన్ పొడవు ఎక్కువగా ఉంది.
కేవలం 2,300 కిలోల బరువున్న ఇంపల్స్ దాదాపు ఒక కారు వెయిట్‌తో సమానంది. 17,248 సోలార్ సెల్స్, ఎలక్ట్రిక్ రిచార్చబుల్ మోటర్స్ ఉన్నాయి ఈ విమానంలో. 633 కిలోల బరువున్న నాలుగు లితియం పాలిమర్ బ్యాటరీలను విమానంలో ఉన్న సోలార్ సెల్స్ రిచార్జ్ చేస్తాయి. ఈ ఫీచర్‌తో ఎయిర్ క్రాఫ్ట్ డే అండ్ నైట్ అని తేడా లేకుండా ట్రావెల్ చేస్తుంది.




