Thursday, 5 November 2026

ఇది పసలేని బడ్జెట్‌…అంతా మాటల గారడీ

నిధుల సమకూరతపై స్పష్టత లేదు : డీకే అరుణ

హైదరాబాద్‌, మార్చి 11 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా మాటల గారడీ అని, పసలేని బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు, మహిళలు, జర్నలిస్టుల ఊసే లేదని విమర్శించారు.
గృహ నిర్మాణానికి నిధులు లేవు, కేజీ టు పీజీ ఊసే లేదన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తక్కువ కేటాయించారని అరుణ అన్నారు. నిధులు ఎలా సమకూరుస్తారనే దానిపై స్పష్టత లేదని మండిపడ్డారు. కొడుకు, అల్లుడు, తనకు కావాల్సిన శాఖలకు కేటాయింపులు జరిగాయని ధ్వజమెత్తారు. త్వరలో వ్యాట్‌తో ప్రజలపై భారం మోపబోతున్నారని డీకే అరుణ వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *