మెట్పల్లి టౌన్, మార్చి 04,జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణములోని సాయిబాబా దేవాలయంలో బిఅర్ఎస్ యువ నాయకులు కల్వకుంట్ల సంజయ్ హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి, ఆంజనేయ స్వాములకు స్వయంగా వడ్డన చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు టిఆర్ఎస్ యువ నాయకులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ మంగళవారం రోజున ప్రత్యేకంగా హనుమాన్ పూజలు నిర్వహించారు.భజన కార్యక్రమాల అనంతరం హనుమాన్ దీక్ష భక్త స్వాములకు భిక్ష ఏర్పాటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి కల్వకుంట్ల సరోజనమ్మ మరియు కౌన్సిలర్స్ ,కో ఆప్షన్, నాయకులు, కార్యకర్తలు సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు
ఆంజనేయ దీక్ష స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ యువ నాయకులు కల్వకుంట్ల సంజయ్ కుమార్




