పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ ఖీమ్యా నాయక్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి
జాయింట్ కలెక్టర్ ఖీమ్య నాయక్
బోయిన్ పల్లి ఏప్రిల్ 04(జనం సాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని విలాసాగర్ పరీక్ష కేంద్రాన్ని బోయినపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పదవతరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని ఎల్నాటి మాస్ కాపీయింగ్ జరగకుండా పగడ్బంది గా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి కి లోను కాకుండా ప్రశాంత వాతావరణం లో పరీక్షలు రాయాలని తెలిపారు.ఆయన వెంట తహశీల్దార్ నరేష్,ఎస్ ఐ మహేందర్ సిబ్బంది ఉన్నారు
పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ ఖీమ్యా నాయక్




