మల్కాజిగిరి.జనంసాక్షి.మే14నేరెడ్ మెట్ పాత పోలీస్ స్టేషన్ కేశవ నగర్ లో వీరాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట,దీప స్తంబ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ బాల్ లింగం,ఆలయ ప్రధాన అర్చకులు జగన్మోహన శర్మ మాజీ ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆసర్ల శ్రీకాంత్,ఆలయ కమిటీ సభ్యులు,అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.




