Thursday, 5 November 2026

విహాన్ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

 

 

 

 

 

 

 

వరంగల్ బ్యూరో, మే 14 (జనం సాక్షి)హసన్ పర్తి మండలంలోని పెంబర్తి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన విహాన్ పబ్లిక్ స్కూల్ భవన సముదాయాన్ని ఆదివారం వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల యాజమాన్యం రామ్మూర్తి, మల్లేషములు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని విద్యానందించేందుకు నూతనంగా భవనాన్ని నిర్మించిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. సువిశాలమైనటువంటి పాఠశాల ఆవరణ తో పాటు చక్కని పాఠశాల తరగతి గదుల నిర్మాణం అదేవిధంగా హాస్టల్ గదుల నిర్మాణం తో పాటు అందులో విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యంగా ఉండేందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఈ పోటీ ప్రపంచానికి దీటుగా విద్యాబోధన అందించేందుకు తమ పాఠశాల కృషి చేస్తుందని యాజమాన్యం తెలిపింది. విద్యార్థులను అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లి వారు గొప్ప ప్రయోజకులు అయ్యే విధంగా తగిన బోధన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరద రెడ్డి, సంపత్ రావు (ఎన్ ఎస్ ఆర్), ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ తిరుపతిరెడ్డి, కార్పొరేటర్లు  సిరంగి సునీల్ కుమార్, శివకుమార్ తోపాటు సర్పంచ్ పూల, ఉపాధ్యాయ బృందం స్థానికులు పాల్గొన్నారు.