ఆందోళనకరంగా మండేలా ఆరోగ్య పరిస్థితి
ప్రిటోరియా : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు అధికార ప్రతినిధి మాక్ మహారాజ్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. అధ్యక్షుడు జాకబ్ జూమా, ఏఎస్‌సీ ఉపాధ్యక్షుడు రామ్‌ఫోసా ఆసుపత్రిలో మండేలాను ఆదివారం పరామర్శించారు.