Wednesday, 4 November 2026

ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు

గోదావరిఖని పట్టణం: మూడు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులు తొలగింపు యత్నాలను మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ జిల్లా రామగుండం నగర పాలక సంస్థ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అందోళనలో భాగంగా విధులు బహిష్కరించి, గంట పాటు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికుల నుంచి మినహాయించుకున్న ఈ.ఎస్‌.ఐ,పీఎఫ్‌ డబ్బులను అయా ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఐకాస నాయకులు ఎం.లింగయ్య, టి.గోపాలంరావు, వై.యాకయ్య, మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *