Wednesday, 4 November 2026

నేడు తెలంగాణలో వర్షాలు కురిసే ప్రభావం ఎక్కువగా ఉంది

విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఆపై చురుగ్గా కదులుతున్న రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఎక్కువచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులకు అస్కారం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయనిభావిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చిచూస్తే తెలంగాణలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలోనూ రెండో విడత రుతుపవనాల ప్రభావం అక్కడక్కడ కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *