Thursday, 5 November 2026

ఆందోళన – జోగిపేట మున్సిపాలిటీలో ట్రిబుల్ ఆర్ సెంటర్లు

ఆందోల్, మే 19, జనంసాక్షి : ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో ఆర్ఆర్ఆర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య అన్నారు. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సెంటర్లలో ఇళ్లలో ఉన్న ఉపయోగంలేని వస్తువులను వేస్తే, అవసరమున్నా వారికి ఇస్తామని తెలిపారు. స్వేచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్ లో అందుబాటులో ఉందన్నారు. ఈ సెంట్లరు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 05 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పుస్తకాలు, బట్టలు, ప్లాస్టక్ వస్తువులు, స్టీల్ సామాన్లు, ఆట బొమ్మలతో పాటు ఇతర వస్తులను త్రిబుల్ ఆర్ సెంటర్లలో అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, కమిషనర్ తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ ఇంచార్జి ఈఈ వినయ్, మెప్మా సిఓ బిక్షపతి తదితలు పాల్గొన్నారు.