Thursday, 5 November 2026

అక్రమాలకు పాల్పడుతున్న బడావిలేఖరి….! మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతున్న అరాచకాలు. తాను సీనియర్ జర్నలిస్టును అంటూ బెదిరింపులు…

జనం సాక్షి /కొల్చారం
విలేకరులు అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రంగంపేట విద్యా కమిటీ చైర్మన్ కొమ్ముల రవీందర్ గౌడ్ అన్నారు. రంగంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విలేకరి ముసుగులో గుంట భూమి లేకున్నా అర ఎకరం భూమి ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకం తయారుచేసి రైతుబంధు రైతు బీమా ద్వారా లబ్ధి పొందడమే కాకుండా రైతు రుణమాఫీ లో కూడా లబ్ధి పొందాడన్నారు అతనికి రెవెన్యూ అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు అర్థం కావడం లేదన్నారు. రెవెన్యూ అధికారుల అవినీతి కారణంగా గుంట భూమిలేని వ్యక్తి కి అర ఎకరం భూమి ఉన్నట్లు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారన్నారు ఈ వ్యక్తి పాఠశాల సమీపంలో ప్రహరీ గోడ కు అనుకొని ఇంటిని నిర్మించడమే కాకుండా బస్టాండ్ స్థలంలోకి జరిగి పాఠశాల లోకి కిటికీలు ఏర్పాటు చేశాడని ఈ విషయమే అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో విలేఖరి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యక్తిపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు పాఠశాల వైపు ఉన్న కిటికీలను మూయించాలని కోరారు లేకుంటే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు