Tuesday, 3 November 2026

ఆంధ్రప్రదేశ్‌లోనూ భూ ప్రకంపనలు

కృష్ణా, గుంటూరు, విశాఖ, కాకినాడ, రాజమండ్రి
భీమవరం, శ్రీకాకుళంజిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు

హైదరాబాద్‌, మే 12 : ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. చాలా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. కృష్ణా, గుంటూరు, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, శ్రీకాకుళం జల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. కాకినాడలోని రామారావు ప్రాంతంలో కొన్ని ఆపార్ట్‌మెంట్‌లలో 4, 5 అంతస్థులో ఉన్నటువంటి కొంతమంది దీనిని గుర్తించారు. ఇంట్లో వస్తువు ఊగినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు వార్తలు రావడంతో కాకినాడలోని అపార్ట్‌మెంట్లలో ఉన్నటువంటి ప్రజలు భయంతో రోడ్లమీదకు వచ్చారు. తర్వాత నెమ్మదిగా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. పెద్దగా నష్టం జరగలేదని తెలియవచ్చింది. విజయవాడ, కృష్ణా జల్లాల్లో పలు ప్రాంతాల్లో పది సెకన్లపాటు స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే భూమి పొరల్లో సర్దుబాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు.

కృష్టా, గుంటూరు జల్లాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా విజయవాడ, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు తరచుగా వస్తున్నాయి. నేపాల్‌లో భూకంపం వచ్చిన సమయంలో కూడా ఈ ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం 10 సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. నదీతీర ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *