హైదరాబాద్:కూకట్‌పల్లిలో రామ్‌దేవ్ ఆస్పత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీనిధి అనే చిన్నారి అభిమానిని… హీరో ఎన్టీఆర్ పరామర్శించారు. వరంగల్ జిల్లా, వర్ధన్నపేటకు చెందిన శ్రీనిధి… కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. తన చివరి కోరికగా హీరో.. జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలని శ్రీనిధి ట్విట్టర్ ద్వారా కోరడంతో.. ఆస్పత్రి వర్గాలు ఎన్టీఆర్‌కు విషయాన్ని చెప్పాయి. దీంతో పాపను ఎన్టీఆర్ పరామర్శించారు. పాప క్షేమ సమాచారం డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. శ్రీనిధి క్షేమంగా ఉండాలని ఎన్టీఆర్ దేవుడ్ని కోరుకున్నారు. తన పరిస్థితి తెలిసి వేధనకు గురయ్యానని ఎన్టీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు చేతనైన సాయం చేస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు.




