హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మహిళా సభ్యత్వ నమోదును నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వ పాలనపై ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీంల పనితీరు బాగుందని చెప్పింది. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పాలనలో సుఖంగా ఉండటం చూసి ఓర్వలేకనే విదేశాల నుంచి పాలన చేస్తున్నట్లు ఉందని చెప్పాడని కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: కవిత





