Wednesday, 4 November 2026

ఆకలి అంటూ అలమటించిన బీసీ బాలికలు 12 గంటలు దాటిన ఉదయం పెట్టాల్సిన అల్పాహారాన్ని అందక అల్లాడిన విద్యార్థులుమెన్యు ప్రకారం భోజనం పెట్టడం లేదు

*

 

 

 

 

 

 

 

 

బషీరాబాద్ ఏప్రిల్ 7, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ వెనకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో శుక్రవారం రోజునఅటుగ వెళ్తున్న కొందరు, విద్యార్థుల రోదన చూసి బషీరాబాద్ ఎంపీడీవో రమేష్ కు సమాచారం ఇవ్వగా వసతి గృహానికి చేరుకొని విద్యార్థులను సంజాయించి భోజనం పెట్టించి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పి విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే వసతి గృహం లో తొమ్మిది మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీళ్లకు రేపు పరీక్షలు ఉండడంతో విద్యార్థులకు సంజాయించి భోజనం పెట్టించి రేపటి ఎగ్జామ్ గురించి ఎంపీడీవో రమేష్ వివరించారు.
అరగంట ఆలస్యం గా నిద్ర మేలుకైన విద్యార్థులకు భోజనం లేదంట,మేన్యూ ప్రకారం భోజనం పెట్టడం లేదు, సాయంత్రం పూట స్నాక్స్ అసలు పెట్టడం లేదు, ఈ విషయాలు మీరు ఎవరితోనైనా చెపితే విద్యార్థిలను వార్డెన్ శశిరేఖ భర్త రవి విద్యార్థిలను రవి కొట్టడం బూతు మాటలు తిట్టడం చాలా బాధాకర విషయం అని అన్నారు. సమయానికి ఎంపీడీవో రమేష్ రావడంతో ఒక్కసారిగా బాగా ద్వేయానికి గురైన విద్యార్థులు ఆయనను పట్టుకొని కన్నీటి మున్నిటి అయ్యారు.
వార్డెన్ శశిరేఖ నిర్లక్ష్యానికి ఆగ్రహానికి గురైన స్థానిక నాయకులు పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్,గోపాల్, నాయక్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రమేష్ కు చేపడం జరిగింది.