*
మిర్యాలగూడ, జనం సాక్షి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు శుక్రవారం స్థానిక ఎంపీడీవో సమావేశం మందిరంలో ఉపాధ్యాయులు అధ్యాపకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అధ్యాపకుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్ టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశం రాష్ట్ర కార్యదర్శి జి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి జిల్లా కార్యదర్శిలు ఎం శ్రీనివాస్ రెడ్డి అడావత్ చిన్న వెంకన్న, వెంకన్న, చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసు, ప్రతాపరెడ్డి, వేదశ్రీ, మధుసూదన్, అమరయ్య, సత్యం,సిహెచ్ శ్యామ్, బోదయా నాయక్, దాశివ, సైదులు, హరి, నాగయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




