ఆకస్మికంగా రేషన్ షాప్లను తనిఖీ చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్.
హన్మకొండ బ్యూరో చీఫ్ 9 జనంసాక్షి
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి కొత్త శాయంపేట లో గల 37,39 రేషన్ షాప్ లను ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు.
కలెక్టర్ వినియోగదారులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా బియ్యం, తదితర సరుకులు పంపిణీ చేయాలని ఆయన అన్నారు. రేషన్ దుకాణంలో నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ విధానం, ఐరిష్, మాస్టర్స్ స్టాకుసంబంధితవివరాలను డీలర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల పౌర సేవల చాటును పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణి చేయాలన్నారు. ప్రజలకు అందించే సేవలలో ఎలాంటి అంతరాయం కలగకూడదని, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బియ్యాన్ని పంపిణీ చేస్తుందని, తెలిపారు.




