Friday, 6 November 2026

రాష్ట్ర తృతీయ మహాసభలను జయప్రదం చేయాలి

రాష్ట్ర తృతీయ మహాసభలను జయప్రదం చేయాలి

– బత్తుల సుధాకర్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర తృతీయ మహాసభలను జయప్రదం చేయాలని నల్గొండ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ పిలుపునిచ్చారు.శుక్రవారం మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు.నేడు రేపు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభలు జరుగుతాయని తెలిపారు.దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరు కానున్నట్లు తెలిపారు.గడిచిన మూడేళ్ల కాలపు కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుంటామని చెప్పారు.ఆర్టీసీ కార్మికులకు రోజురోజుకు పనిభారాలు పెరుగుతున్నాయని అన్నారు. 2017, 2021 వేతన సవరణ జరగాల్సి ఉండగా ప్రభుత్వం నేటి వరకు స్పందించకపోవడం అన్యాయమన్నారు.కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ రీజియన్ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, డిపో అధ్యక్షులు గుండు రమేష్ , డిపో కోశాధికారి బైరు శ్రీకంఠం, వెంకన్న , మునీర్ , మోహన్ , రవీందర్, సతీష్ , అనిత తదితరులు పాల్గొన్నారు