: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ మార్చ్ 22 జనం సాక్షి
ఆకస్మిక వడగళ్ల వర్షానికి ఇంతలా పంటలు నష్టపోవడం బాధాకరమని నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తానని నష్టపరియాల అందించే వరకు మీతో పాటు ఉద్యమిస్తానని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని కోట్ పల్లి మండల పరిధిలోని మోత్కుపల్లి బార్వాద్ కరీంపూర్ ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఆకస్మిక వర్షాలతో ఇంతలా పంట నష్టం జరగడం చాలా బాధాకరమని, రైతులెవ్వరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ రైతుబంధు అధ్యక్షులు సత్యం డాడీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక వర్షాలతో ఇంతలా పంట నష్టం జరగడం బాధాకరం




