…హిందువాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణి…
బై0సా రూరల్ మార్చ్ 22 జనం సాక్షి
పట్టణంలోని శివాజీ చౌక్ లో బై0సాపట్టణ హిందువాహిని శాఖ అధ్వర్యంలో ఉగాది ని పురస్కరించుకొని ఉగాది పచ్చడి ని అందించారు. అనంతరం పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు… హిందూ సంప్రదాయంలో ఉగాది పండుగ నూతన సంవత్సర పండగని, ఈ పండగకి విశిష్టత ఉందని, ప్రతి హిందువు ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకొని, నూతన కార్యక్రమాలను ఇదే రోజు ప్రారంభిస్తారని, రైతులు సైతం తమ వ్యవసాయ పనులను ఇదే రోజున ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ హిందు వాహిని సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హిందువాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణి




