ఆకాష్ బైజూస్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ పరీక్ష

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి ) :

ఆజాదిక అమృత్ మహోత్సవములో భాగంగా ఆకాష్ బైజూస్ సమ్మిళితంగా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని చేపట్టారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రెండువేల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి అన్నారు. తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 నుండి ఇప్పటి వరకు 13 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 6 నుండి 13 వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా రెండు వేల మందిని సెలెక్ట్ చేసి స్కాలర్షిప్ తోపాటు నీట్ జేఈఈ ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ఐదుగురిని నాసాకు తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.