జనంసాక్షి, మంథని : ఖాళీగా గడిపే సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ మహిళలకు ఆకు విస్తర్ల తయారీపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. బార్య భర్తలు పనిచేస్తేనే కుటుంబం గడిచే రోజుల్లో కాలాన్ని వృధా చేసుకోవద్దని, ప్రతి క్షణం విలువైందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక మంది మహిళలకు ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్తుంటారని, ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే కూలీ పనులు లభిస్తాయన్నారు. పంటల సాగు సమయంతో పాటు పత్తి ఏరే సమయంలో మాత్రమే మహిళలకు కూలీ పనులు దొరుకుతాయన్నారు. మిగతా సమయాల్లో ఖాళీగా ఉండకుండా ఆకు విస్తర్ల తయారీపై దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. అలాగే కూలీ పనులకు వెళ్లి వచ్చిన తర్వాత ప్రతి రోజు గంట, అరగంటో ఆకు విస్తర్లు తయారు చేసుకుంటే కొంతమేర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుందన్నారు. ఆకు విస్తర్ల తయారీతో ఆరోగ్యం మరియు మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే విధంగా తాము ప్రయత్నం చేస్తున్నామని, విస్తర్ల తయారీకి వినియోగించే ఆకులను తామే అందజేస్తామని ఆమె తెలిపారు.మహిళలు తీరిక సమయాల్లో ఆకు విస్తర్లు తయారు చేస్తే ఆరోగ్యం కారంగా ఉండే ఆకు విస్తారుతో పాటు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కుటుంబపోషణకు చేయూతనందించాల్సని అవసరం ఉంటుందని, మహిళలు ఆలోచన చేసి ఆకు విస్తర్ల తయారీపై దృష్టిసారించాలని కోరారు.
ఆకు విస్తర్ల తయారీతో ఆర్థికస్వావలంభన సాధించుకోవాలే మహిళలకు మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ గారి అవగాహన




