Tuesday, 3 November 2026

రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి

;- వేల్పులసారంగపాని( సిఐటీయు) జిల్లా ఉపాధ్యక్షలు

;- తోట మల్లేష్ం మండల కార్యదర్శి

;-హన్మకొండ ప్రతినిది జులై 2 జనంసాక్షి31, డివిజన్ న్యూ శ్యాయంపేట బస్ స్టాప్ కుడలి ఇందిరా గాంధీ విగ్రహం నుండి శాయంపేట రైల్వే ట్రాక్ వరకు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి అని సిపియం పార్టీ డిమాండ్ చేశారున్యూ శాయంపేట లోని ప్రధాన రోడ్ నిర్మాణాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు న్యూ శాయంపేట లోని బస్టాండ్ కూడలి వద్ద సిపియం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది.అనంతరం సిపిఎం, పార్టీ కాజీపేట మండల కార్యదర్శి తోట్టే మల్లేశం, సిఐటియూ, జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి గార్లు మాట్లాడుతూ న్యూ శాయంపేట హంటర్ రోడ్ 31, డివిజన్ లోని ఇందిరాగాంధీ బస్టాండ్ కూడలి నుండి రైల్వే ట్రాక్ వరకు బి.టి.రోడ్డు మరియు సి.సీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నమని బడ్జెట్ కూడ కేటాయించి శిలా శాసనం ప్రారంభం చేసి సంవత్సరాలు గడిచినా రోడ్ కు అతి గతి లేదు గ్రేటర్ కార్పొరేషన్ అధికారులకు అనేకసార్లు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాలు సిపిఎం పార్టీగా అనేకసార్లు వినతులు ఇచ్చినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఏమి మాత్రం పట్టించుకోవడం లేదు రోడ్లు సరిగా లేక కంకర తేలి దుబ్బ దూళితో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సంబంధిత ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ రోడ్డు నిర్మాణం మాత్రం జరుగుతలేదు కావున ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనర్ గారు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేకుంటే విషయం పేట ప్రజల ఐక్యం చేసి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడించడానికి వెనుకాడేది లేదని వారు కార్పొరేషన్ అధికారులకు సిపియం పార్టీ గా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చిగురు శ్రీనివాస్, కుమార్,భాగ్యలక్ష్మి, మూర్తి, లక్ష్మణ్ ,భాగ్య, వసంత, రాజు, శ్రీను, , రమేష్, రాణి, కవిత రమ్య, తదితరులు పాల్గొన్నారు.