Monday, 2 November 2026

ఆగస్ట్ 1 నుంచి రూపాయికే నల్లా కనెక్షన్

water-connectionగ్రేటర్ హైదరాబాద్ లో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని జిహెచ్ ఎంసి నిర్ణయించింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆధార్, వైట్ రేషన్ కార్డుల ఆధారంగా ఈ మంజూరు జరుగుతుంది. లబ్ధిదారులు తమది సొంత ఇల్లు అన్న ధ్రువీకరణ పత్రం, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు ఎవరైనా సమాచారమిస్తే వారికి నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించింది. అలా సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *