హైదరాబాద్, మార్చి 30: సాంకేతికలోపంతో లిఫ్ట్ ఆగిపోవడంతో అందులో ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసిహారెడ్డి కొంత టెన్షన్ పడ్డారు. అయితే, అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన సోమవారం ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది.




