Wednesday, 4 November 2026

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 10. (జనంసాక్షి). జిల్లా కేంద్రంలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. తంగడపల్లి మండలం కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్యం బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు, నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సహకార విద్యుత్ సంస్థ సెస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ. పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు