హైదరాబాద్ : 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 78 వద్ద ఉంది. ఓపెనర్లు ఇద్దరూ కొన్ని ఉద్విగ్న క్షణాల అనంతరం కుదురుకున్నట్లుగా కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ 38, ధావన్ 32 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఐర్లాండ్ రెండు వైపుల నుంచి స్పిన్‌ని మోహరించింది. స్పిన్ బౌలింగ్ ప్రభావం భారత బ్యాట్స్‌మెన్లపై ఏ మాత్రం కనిపించడం లేదు. ఐర్లాండ్ బ్యాటింగ్‌లో ఉన్నంత లోతు బౌలింగ్‌లో లేదు. భారత బ్యాట్స్‌మెన్లు కొంత ఆచితూచి ఆడితే లక్ష్యాన్ని చేరటం సులభమే.




