వరంగల్ ; వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను, కొడుకును కిరాతంగా హత్య చేశాడు భర్త. పరకాల పట్టణంలో నివాసముంటున్న ప్రసాద్ , మంజుల దంపతులకు తొమ్మిది నెలల బాబు ఉన్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రసాద్ భార్య, కొడుకును హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని ప రిశీలించారు. నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




