Wednesday, 4 November 2026

ఆటోను కారు ఢీ: ఓ మహిళ మృతి

కోదాడ పట్టణం: నల్గొండ జిల్లా కోదాడలో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలుకూరు మండలం బేతవోలు నుంచి చిల్లకల్లు వెళ్తున్న ఆటోను కోదాడ జాతీయ రహదారిపై వెన నుంచి వస్తున్న ఇండికా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బోర్ల భద్రమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ బెల్లంకొండ  సైదులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. బోర్ల వెంకన్న, పాశబోయిన గురువయ్యలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *