హైదరాబాద్: నిన్న డీజీపీ కార్యాలయం ముందు ఆటోలో పట్టుబడిన రూ.6.70 కోట్ల రూపాయల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బు తనదేనని ఈరోజు ఉదయం పోలీసులకు లొంగిపోయిన స్థిరాస్తి వ్యాపారి రామారావును ప్రశ్నించిన పోలీసులు ఈ వివరాలు సేకరించారు. మైసూరులో బాలసాయి ఆశ్రమానికి భూమి కొనేందుకు డబ్బులు తరలిస్తున్నట్లు తెలిసిందని డీసీపీ తరుణ్‌జోషీ తెలిపారు. బాలసాయి ఆశ్రమం సభ్యుడు తుమ్మపల్లి రామారావు డబ్బు తమ ట్రస్టుదేనని తమని ఆశ్రయించారని, వంశీ అనే వ్యక్తి నగదును కోఠినుంచి అమీర్‌పేటకు ఆటోలో తీసుకెళ్తున్నాడని, వంశీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని డీసీపీ పేర్కొన్నారు. అన్సారీ అనే బ్రోకర్‌కు ఇచ్చేందుకు వంశీ ఆ డబ్బును అమీర్‌పేటకు తీసుకెళ్తున్నాడని చెప్పారు. పట్టుబడిన నగదును ఐటీ శాఖకు అప్పగించామని, వారు విచారణ చేయాల్సిఉందని ఆయన తెలిపారు. రూ. 4.98 కోట్లు దోమలగూడ ఆంధ్రాబ్యాంకు నుంచి డ్రా చేశారని పోలీసులు తెలిపారు.




