బచ్చన్నపేట,(జనం సాక్షి) మార్చి 16: బచ్చన్నపేట మండల ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్పర్ అసోసియే షన్ నూతన కమిటీ నియామకం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో జరిగింది. గురువారం జరిగిన నూతన కమిటీ నియామకంలో మండల అధ్యక్షులుగా సందెల లక్ష్మణ్ , ఉపాధ్యక్షులుగా మామిడి ఐలయ్య, పురుమ రాంబాబు, పస్తం ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా బోలుగుల లక్ష్మణ్, కార్యదర్శులుగా తవిటి భాస్కర్, చిలుముల రమేష్, గుంటుపల్లి శోబన్, కోశాధికారిగా ఎండి యాకుబ్ పాష , ఆటో ఆర్గనైజర్ గా చందు , మండల కార్యవర్గ సభ్యులుగా బోలుగుల యాదగిరి, మినలాపురం శ్రీధర్, దొంతుల నాగేష్,గద్ద సత్యనారాయణ, బూరుగు కరుణాకర్, దూడల సిద్ధులు, బాలరాజు, కనకయ్య, శ్రీనివాస్ బిక్షపతి,లు నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికైన డ్రైవర్లు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ప్రయాణ విషయంలో జరుగుతున్న పరిణామాలపై, రవాణా చార్జిల విషయాలపై సమిష్టి కృషిగా ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు .
ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక




