సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్మోమిన్ పేట మార్చి 16 జనం సాక్షి
అకాల వడగళ్ల వర్షానికి పాడైన పంటలపై హార్టికల్చర్ రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అకాల వడగళ్ల వర్షానికి మోమిన్ పేట మండలం చుట్టుపక్కల ప్రాంతాలు కెనడా వంటి మంచుప్రాంతాలను తలపించాయని ఆయన చెప్పారు. ఈ వడగళ్ల వర్షానికి మండలంలోని సుమారు 1000 ఎకరాల్లో టమాటా, క్యాబేజి, క్యాలీఫ్లవర్, ఉల్లి, మామిడి వంటి హార్టికల్చర్ పంటలు పాడైపోయాయని ఆయన తెలిపారు. అసలే పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక బాధతో ఉన్న రైతులకు వడగళ్ల వర్షంతో పొలంలోనే పంట పాడవడం దుఃఖాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వడగళ్ల వర్షానికి పాడైన పంటలపై హార్టికల్చర్ రైతులకు ప్రభుత్వం ఎకరాకి రూ.25 వేలు నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.




