Wednesday, 4 November 2026

ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా యూనియన్.

బెల్లంపల్లి, జూన్ 16, (జనంసాక్షి )ఆటో డ్రైవర్ కుటుంబానికి బెల్లంపల్లి ఆటో యూనియన్ అండగా నిలిచింది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ దస్తగిరి ఇటీవల మరణించగా శుక్రవారం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్టా రామ్ కుమార్ దస్తగిరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దస్తగిరి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. దినకర్మలకు గాను ఆటో డ్రైవర్ల సహకారంతో క్వింటాల్ బియ్యం, 17 లీటర్ల నూనె తో పాటు ఆటో డ్రైవర్లు శంకర్ 500, సుమన్ 500, హనుమాన్ బస్తీ రాజు 500 నగదు అందజేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.