Wednesday, 4 November 2026

బిసి బందు కోసం కాంగ్రెస్ ఆందోళన

శుక్రవారం చెన్నూరు నియోజకవర్గ లో మందమర్రి మండలంలోని కాంగ్రెస్ పార్టీ మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో…. మందమర్రి తాసిల్దార్ కార్యాలయం ముందు బీసీ బందు రాష్ట్ర ప్రభుత్వం బీసీల పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియడం జరిగింది.. అనంతరం తాసిల్దార్ సంపత్ శ్రీనివాస్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది…ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్ మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని. పదో సంవత్సరంలో అడుగుపెడుతున్నప్పటికీ బీసీలకు సమన్యాయం జరగలేదని.. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బీసీ కార్పొరేషన్ తొమ్మిది లక్షల దరఖాస్తు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ బీసీ కార్పొరేషన్సబ్సిడీ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదని… రాష్ట్రవ్యాప్తంగా 60% బీసీలను కులాలు వారు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని… ఇప్పటికీ కూడా రోజువారి కూలీలుగా, వ్యవసాయ రంగంలో, కుల వృత్తుల పైన ఆధారపడి జీవిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కులవృత్తుల లక్ష రూపాయలు ఆర్థిక సాయం., కేవలం 15 కులాలకు మాత్రమే పర్మిత చేయడం… చాలా బాధాకరమని… లక్ష రూపాయలు తోటే బీసీల జీవితాలు మారని… దళిత మిత్రులకు ఎట్లాగైతే.. దళిత బంధువు ప్రవేశపెట్టిన.. రాష్ట్ర ప్రభుత్వం.. బీసీ బందు ప్రతి అర్హుడైన బీసీకి 10 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం చేయాలని… కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు… కార్యక్రమంలో ఆదిల్ పేట మాజీ సర్పంచ్ తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంకం రాజ్ కుమార్, మండల నాయకులు, మాస్ సంతోష్, రామంచ రాములు , మాజీసర్పంచ్ నంబయ్య, హనుమంతు, ఓ.బాబు, కొండపర్తి మధుకర్,రాగుల రాజు, మైపాల్, సంతోష్, రాజు, పోషం, రవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది….