కొత్తగూడ జూన్ 16 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుడి తండా గ్రామానికి సమీపంలో (పెద్ద వంప్పు) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు పెండ్యాల బుచ్చమ్మ 70 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది.మృతురాలి స్వగ్రామం మాదన్నపేట… పొగుళ్ళపల్లి లోని పుట్టినరోజు వేడుకలకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ఆటోలో 11 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు.మరో ఇద్దరికి కాళ్లు విరగడం జరిగింది.మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆటో బోల్తా…ఒకరు మృతి




