బెల్లంపల్లి, జూన్ 16, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద శుక్రవారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. నేటి కార్యక్రమం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత జన్మదినం సందర్బంగా తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకులు అంతడుపుల నాగరాజు పూర్తి సహకారంతో 191వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాతలు అంతడుపుల నాగరాజు, ఎండీ జావీద్ ఖాన్, అమ్మఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, అమూల్య, నారాయణ, లెంకల శ్రావణ్ కుమార్, బియ్యాల ఉపేందర్, ఎండీ యూసుఫ్, చెందుపట్ల లింగన్న పాల్గొన్నారు.
అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.




