Wednesday, 4 November 2026

ఆడపిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయాలి

సిరికొండ: తల్లిదండ్రులు తమ పెంపకంలో ఆడపిల్లలకు ధైర్యం నూరిపోయాలని ప్రగతి శీల మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా మంగళవారం సిరికొండలో పీవోడబ్ల్యూ ఆర్మూర్‌ డివిజన్‌ మహిళాసదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోదావరి మాట్లాడుతూ స్త్రీల పై లైంగిక వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదే స్థాయిలో భ్రూణ హత్యలు కూడా పెరిగాయన్నారు. ఒక రకంగా భ్రూణ హత్యలకు మహిళలే కారణమని, మహిళల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో సమాజంలో వేధింపులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్‌ కార్యదర్శి భాగ్య,
మండల కార్యదర్శి సుభద్ర, రమ, శోభ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ డివిజనల్‌ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *