హైదరాబాద్ : రోజురోజుకూ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుండడం బాధాకరమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నగరంలోని చార్మినార్ నుంచి బేగంపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని దత్తాత్రేయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐపీఎస్ అధికారిణి స్వాతిల్రకా తదితరులు పాల్గొన్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ… మహిళలపై అత్యాచారాలను నివారించాలని, కాలేజీల్లో ర్యాగింగ్‌ను అరికట్టాలన్నారు.




