Wednesday, 4 November 2026

ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ మే 08 (జనం సాక్షి)
ఆడబిడ్డల పక్షాన కొండంత అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారం బంట్వారం మండల కేంద్రంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన .31,03,596 ముప్పై ఒకటి లక్షల మూడువేల ఐదు వందల తొంబై ఆరు విలువ గల 31 కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో 67.50 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా నిలుస్తూప్రతి దశలో ఆడబిడ్డలకు తోడుగా సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.