Wednesday, 4 November 2026

ఆడెపు రవీందర్ రాసిన పాట తెలంగాణ దశాబ్ది ఉత్సవ అధికారిక పాటగా గుర్తింపు

వరంగల్ ఈస్ట్, జూన్ 08 (జనం సాక్షి)రచయిత ఆడెపు రవీందర్ కలం నుండి జాలువారిన దేశ  ప్రగతిలో ముందు నిలుస్తూ తెలంగాణ నేడు. దశాబ్ది పండుగ సంబరాలను జరుపుకుంటుంది చూడు. అనే పాట తెలంగాణ దశాబ్ది ఉత్సవాల అధికారక పాటగా గుర్తింపు పొందింది   రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వుల. ననుసరించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అధికారికంగా జరిగేప్రతి కార్యక్రమంలో ఈ పాట ప్రసారం చేయాలనే ఆదేశాలుజిల్లా శాఖలకు అందడంతో వరంగల్ జిల్లాకు చెందిన రచయితగా రాష్ట్రంలో గుర్తింపు లభించిందితెలంగాణ సాధన ఉద్యమంలోవిడుదలైన జై తెలంగాణ సినిమాకు కథా రచయితగా మొదటిసారి మరియు 31 జిల్లాల తెలంగాణ మాది అనే పాటతో రెండవసారి తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్న రవీందర్ మరోసారి దశాబ్ది పాటతో తన సత్తా చాటాడు..’వరంగల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల శంభునిపేట లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆడెపు రవీందర్ కేవలం రచనల్లోనే కాకుండా తన వృత్తి ధర్మంలోకూడాఉత్తమ సేవలందిస్తూ విద్యాధికారుల ప్రశంసలు పొందుతున్నాడు.